Publish Date:Feb 13, 2025
బిఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశం ఈ నెల 19న తెలంగాణ భవన్ లో జరుగనుంది. టిఆర్ఎస్ (బిఆర్ ఎస్ )స్థాపించి 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్బంగా ఈ సమావేశం నిర్వహించనున్నారు.
Publish Date:Feb 13, 2025
ఏపీసీసీ మాజీ చీఫ్ శైలజానాథ్ కాంగ్రెస్ ను వీడి వైసీపీ గూటికి చేరి ఆరు రోజులయ్యిందో లేదో.. జగన్ కు బిగ్ షాక్ ఇచ్చారు. వైసీపీ పగ్గాలు విజయమ్మకు అప్పగించాలంటూ జగన్ గాలి తీసేశారు.
Publish Date:Feb 13, 2025
పార్లమెంటు ఉభయ సభలు వాయిదా పడ్డాయి.వక్ఫ్ సవరణ బిల్లుపై జెపిసీ ఇచ్చిన రిపోర్ట్ కు రాజ్యసభ ఆమోదం తెలిసింది. దీంతో రాజ్య సభలో గందరగోళం నెలకొంది. జగదాబికా పాల్ నేతృత్వంలోని జెపిసీ రిపోర్ట్ కు వ్యతిరేకంగా విపక్షాలు రాజ్య సభలో నిరసనకు దిగాయి.
Publish Date:Feb 13, 2025
గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని అరెస్టు వార్త గురువారం (ఫిబ్రవరి 13) ఉదయమే రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఆయన ముందస్తు బెయిలు కోర్టులో పెండింగ్ లో ఉండగా ఎలా అరెస్టయ్యారన్న అనుమానాలు వ్యక్తమైనా, గన్నవరం తెలుగుదేశం కార్యాలయంపై దాడి కేసులో కాకుండా మరో కేసులో వల్లభనేని వంశీ అరెస్టయ్యాడని తెలియడంతో ఆ కేసేమిటా అన్న ఆసక్తి సర్వత్రా వ్యక్తం అయ్యింది.
Publish Date:Feb 13, 2025
నటుడు మోహన్ బాబుకి సుప్రీం కోర్టులో భారీ ఊరట లభించింది. జర్నలిస్టుపై దాడి కేసులో ఆయన సుప్రీం కోర్టు ముందస్తు బెయిలు మంజూరు చేసింది. తెలుగు సినీ పరిశ్రమతో ఐదు దశాబ్దాల అనుబంధం ఉన్న మోహన్ బాబు ఈ ఐదు దశాబ్దాలలో పలు విజయవంతమైన చిత్రాలలో నటించారు. పలు చిత్రాలకు నిర్మాతగా కూడా వ్యవహరించారు.
Publish Date:Feb 13, 2025
తెలుగు రాష్ట్రాలలో బర్డ్ ఫ్లూ వ్యాప్తి వేగం ప్రజలను వణికించేస్తున్నది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో అందులోనూ ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాల్లో బర్డ్ ఫ్లూ వ్యాప్తి తీవ్రాతి తీవ్రంగా ఉంది. బర్డ్ ఫ్లూ కేవలం కోళ్లు, పక్షులకే కాకుండా మనుషులకూ వ్యాపిస్తోంది.
Publish Date:Feb 13, 2025
ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ భవిష్యత్ అగమ్యగోచరంగా మారింది. గత ఎన్నికలకు ముందు వైఎస్సార్ కుమార్తె షర్మిలను కాంగ్రెస్ లోకి చేర్చుకోవడం ద్వారా వైసీపీని దెబ్బకొట్టేందుకు ఆ పార్టీ పన్నిన వ్యూహం పెద్దగా ఫలితాన్ని ఇవ్వలేదు. ఇప్పుడు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి అదే వ్యూహాన్ని రివర్స్ లో అమలు చేస్తున్నారు. ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్నట్లుగా తనకు బద్ధ విరోధిగా మారిన షర్మిలను దెబ్బకొట్టడంతో పాటు.. రాష్ట్రంలో వైసీపీని బలోపేతం చేయడానికి కాంగ్రెస్ కు ఖాళీ చేసే వ్యూహాన్ని అమలు చేస్తున్నారు.
Publish Date:Feb 13, 2025
మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వేలో చంద్రబాబు నాలుగో స్థానంలో ఉన్నారు.గత ఏడాది ఆగస్టులో ఆయన ఐదో స్థానంలో ఉన్నారు.
Publish Date:Feb 13, 2025
చింతచచ్చినా పులుపు చావదు అన్నట్టు ఉంది వైకాపా పరిస్థితి. గత అసెంబ్లీ ఎన్నికల్లో 11 స్థానాలకు పడిపోయినా వైకాపాకు బుద్దిరాలేదు. టిడిపి ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పై బుధవారం రాత్రి వైకాపా గూండాలు దాడి చేశారు.
Publish Date:Feb 13, 2025
ఆంధ్రప్రదేశ్‌లో బర్డ్ ఫ్లూ వ్యాప్తి తీవ్ర రూపం దాల్చింది. కోళ్లు, పక్షులే కాకుండా మనుషులకు సైతం సోకుతోంది. బర్డ్ ఫ్లూ చాపకింద నీరులా అతి వేగంగా విస్తరిస్తుండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు.
Publish Date:Feb 13, 2025
గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని పోలీసులు అరెస్టు చేశారు. తెలుగుదేశం టికెట్ పై 2019 ఎన్నికలలో గన్నవరం నుంచి విజయం సాధించి.. ఆ తరువాత వైసీపీలోకి జంప్ చేసిన వల్లభనేని వంశీ.. పార్టీ ఫిరాయించి ఊరుకోలేదు. తెలుగుదేశం నాయకులు, క్యాడర్ లక్ష్యంగా దాడులు చేశారు.
Publish Date:Feb 13, 2025
సోషల్ మీడియాలో అనుచిత పోస్టులపై సజ్జల రామకృష్ణారెడ్డి కుమారుడు సజ్జల భార్గవ్ పై కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఈ విషయంలో తనను అరెస్టు చేయకుండా ఆదేశాలు ఇవ్వాలంటూ పిల్ల సజ్జల అదే సజ్జల భార్గవ్ రెడ్డి దాఖలు చేసుకున్న పిటిషన్ పై ఏపీ హైకోర్టు నేడు విచారించనుంది.
Publish Date:Feb 12, 2025
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. గురువారం (ఫిబ్రవరి 13) ఉదయం శ్రీవారి దర్శనం కోసం భక్తులు 24 కంపార్ట్ మెంట్లలో వేచి ఉన్నారు.